హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో పొలాల అమావాస్య వేడుకలు

KDP: సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరులోని అంకమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం చివరి రోజు సందర్భంగా పొలాల అమావాస్య వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ముందుగా అమ్మవారికి జలాభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. మహిళలు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.