హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధునిక సాంకేతికతతో అధిక లాభాలు: కలెక్టర్

ADB: సాగు ఖర్చులు తగ్గించి, సమయం ఆదా చేసేలా ఆధునిక సాంకేతికతను వాడాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం తలమడుగు మండల కేంద్రంలో పర్యటించి డిజిటల్ క్రాప్ సర్వే, డ్రోన్ పిచికారీని పరిశీలించారు. ఫాంపాండ్ల నిర్మాణం, ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులను కోరారు. నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ, అలాగే, ఉచిత పోలీస్ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.