హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాతా శిశు మరణాల నియంత్రణకు చర్యలు'

సత్యసాయి జిల్లాలో మాతా శిశు మరణాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజా బేగం సూచించారు. పుట్టపర్తిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భధారణ, ప్రసవానంతర సమయాల్లో ఆశా, ఆరోగ్య కార్యకర్తలు గృహ సందర్శనలు చేసి వైద్య పరీక్షలు అందించాలని చెప్పారు. ప్రసవమైన అరగంటలోపే పాలు పట్టించాలని అన్నారు.