హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబాలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు

NTR: విజయవాడ 61వ డివిజన్‌ దేవినేని గాంధీపురం ప్రాంతంలో అర్హులైన పేద కుటుంబాలకు 306 జీవో ప్రకారం ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసినట్లు ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో పత్రాలను లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాల హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.