హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పని ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగుల డిమాండ్

కృష్ణా: గుడివాడలో శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. గుడివాడ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. బ్యాంకు ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న అధిక పని ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.