హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీదారులకు ఉచిత భోజన సదుపాయం

ASR: సుదూర ప్రాంతాల నుంచి పాడేరు పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీదారులకు ప్రతి శుక్రవారం ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు జేసీ శ్రీపూజ తెలిపారు. ఐటీడీఏ, అన్న క్యాంటీన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అన్నారు. అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.