హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు పట్టణంలో పోషణ్ మాసం ర్యాలీ

CTR: పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం సూపర్‌వైజర్ అయేషా నజ్రీన్ తాజ్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యకరమైన జీవన విధానంపై వివరిస్తూ అవగాహన కల్పించారు.