ADB: ఆదిలాబాద్‌లో కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలోనే తొలి కార్మిక సౌలభ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ప్రభుత్వ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అనూష, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు.
తెలంగాణ
కార్మిక సౌలభ్య కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్


