ASF: బెజ్జూరు మండల కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షంతో కొంత ఊరట లభించింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కురిసిన ఈ వాన పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం సాగులో ఈ వర్షం ఎంతగానో దోహదపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, భారీ వర్షంతో కాసేపు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది.
తెలంగాణ
భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం


