SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోవిందరావు క్యాడర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే టీడీపీకి నిజమైన బలమని పేర్కొన్నారు. అలాగే, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కూటమి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తలే టీడీపీకి నిజమైన బలం'


