హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే

అనకాపల్లి మండలం కొత్తూరు సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు. అర్హతలు, దరఖాస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.