హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి పొలాలకు వర్షంతో జలకళ

ASR: చింతపల్లి మండలంలో కురిసిన విస్తారమైన వర్షాలతో వరి పొలాలకు నీటి లభ్యత సమృద్ధిగా ఏర్పడింది. శుక్రవారం ఏవో టీ.మధుసూదనరావు రైతులతో కలిసి చౌడుపల్లి గ్రామంలో వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం సాగులో ఉన్న వరితో పాటు, ఇతర పంటలకు ఈ వర్షపాతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. వర్షాలతో పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.