హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు గడువు పొడిగింపు

ADB: జిల్లాలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 60 రోజుల పోలీస్‌ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును ఈనెల 13 వరకు పొడిగించినట్లు కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలిపారు. మొత్తం 200 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13లోగా ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.