హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయం'

VZM: ఎస్‌.కోటలోని ఎస్సీ కాలనీలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణానికి విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే, ప్రజా సంక్షేమమే తమ ముఖ్య అభిమతమని పేర్కొన్నారు.