ASF: అటవీ అధికారుల సంస్మరణ దినోత్సవ సందర్బంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కాగజ్ నగర్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అడిషనల్ కలెక్టర్ హర్షచౌదరి, DFO భార్గవ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అ. కలెక్టర్ రక్తదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ
రక్తదానం చేసిన అ. కలెక్టర్


