హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

W.G: మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆకివీడు SI శుభశేఖర్ సూచించారు. స్థానిక ప్రైవేటు కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు పోక్సో చట్టం, డయల్ 112, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.