అన్నమయ్య: రాయచోటి రూరల్ పరిధిలోని దూలవారిపల్లి గ్రామం స్వర్ణ గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు కొండారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రాయచోటి తహసీల్దార్ యామిని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ


