హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆచంటలో మూతపడ్డ బ్యాంకులు

W.G: ఆచంట మండల వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. వారంలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఆచంట, కొడమంచిలి, వల్లూరు గ్రామాల్లో బ్యాంకు సిబ్బంది సమ్మె బాట పట్టారు. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.