ELR: చింతలపూడిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


