హైదరాబాద్: 28°C
తెలంగాణ

35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

వరంగల్ క్రిస్టియన్ కాలనీలో అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేశారన్న విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 35 క్వింటాళ్ల పీడీఎస్, బ్రోకెన్ రైస్, క్లోజింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.27 లక్షలుగా పోలీసులు తెలిపారు. గోవిందుల గణేశ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బా రెడ్డి తెలిపారు.