హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోస్ట్ ఆఫీస్ వీధిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయండి'

GDWL: అలంపూర్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వీధిలో ఇటీవల సీసీ రోడ్లు వేశారు. కానీ నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డులో ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయలేదు. దీంతో పలువురు యువకులు, వాహనదారులు అతివేగంగా వాహనాలపై ప్రయాణాలు చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.