హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తగ్గిన వర్షపాతం.. రైతుల ఆందోళన

AKP: వర్షాభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నందున, జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. ఎస్.రాయవరం మండలం గోకులపాడులో ఎండిపోయిన వరినారు మడులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సెప్టెంబరు 10 నాటికి 535.4 మి.మీ. సాధారణ వర్షపాతానికి కేవలం 240.4 మి.మీ. మాత్రమే నమోదైందన్నారు.