హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ హాస్టల్‌కు కొత్త భవనం ప్రతిపాదనలు

WNP: ఖిల్లాఘనపూర్‌లో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం పరిశీలించారు.నూతన భవన నిర్మాణానికి అవసరమైన వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఎస్సీ సంక్షేమ అధికారిని ఆదేశించారు.అంతవరకు విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ భవనం గుర్తించి,అవసరమైన సౌకర్యాలతో నిర్మించాలన్నారు.