హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘డప్పు కళాకారులు రుసుము చెల్లించవద్దు’

PLD: డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి లక్ష్మయ్య తెలిపారు. అర్హులు స్వీయ ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.