ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద నెల్లూరు-చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ఆటోను పాల డెయిరీ లారీ బలంగా ఢీకొట్టింది. కట్టెల సేకరణకు వెళ్లిన సమయంలో ఆటో దిగి రోడ్డుపక్కన నిలబడి ఉన్న రమేశ్ (32)ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న సుబ్బయ్యతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి


