NLR: కోవూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం స్వామివారికి అరటి చెట్లతో ఒక గుడిని ఏర్పాటు చేసి, అందంగా అలంకరించి పూజ చేశారు. పర్యావరణ పరిరక్షణ, మట్టి విగ్రహాల వినియోగం, వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినాయక చవితి వేడుకలు


