హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘మార్కాపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి’

ప్రకాశం: మార్కాపురం జిల్లాలోని 21 మండలాలను ప్రభుత్వం వెంటనే కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎస్‌కే మౌలాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం చంద్రశేఖరపురంలో ధర్నా నిర్వహించారు. కరువుతో రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.