హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవిష్యత్ తరాల కోసం అధికారులు కష్టపడుతున్నారు: SP

BDK: జిల్లాలో అటవీశాఖ అధికారులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. అటవీశాఖ అధికారులు భవిష్యత్ తరాల కోసం కష్టపడి పనిచేస్తున్నారన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు అటవీ సంపదను అందించేందుకు అటవీ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొన్నారు.