హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యుత్ అంతరంపై ప్రజలు సహకరించాలి'

TPT: వరదయ్యపాళెం మండలంలో ఈరోజు రాత్రి 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ గురుమూర్తి తెలిపారు. చిన్నపండూరు, సంతవేలూరు, బత్తలవల్లం సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఈ అంతరాయం ఉంటుందన్నారు. అత్యవసర లోడ్ నియంత్రణ (ఈఎల్‌ఆర్‌)లో భాగంగా సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.