హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ

NRML: వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఇవాళ నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట గ్రామంలోని తల్వేదా, తదితర గ్రామాల మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలకు తీసుకోవాల్సిన అంశాలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.