MDK: ఇంటి పరిసరాలలో పిచ్చి మొక్కలు, నిలువ నీరు లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్ తెలిపారు. చేగుంట (మం) గొల్లపల్లి, రెడ్యా తాండ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను పరిశీలించారు. దోమల కారణంగా జ్వరాలు వస్తాయని, ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్వో అనిషుద్దీన్, ఆరోగ్య విస్తరణ అధికారి శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'


