హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన..!

KMM: వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య శుక్రవారం దంసలాపురం చెరువును సందర్శించారు. జాయింట్ కలెక్టర్, పోలీస్, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. విగ్రహాల వాహనాలకు ఆటంకాలు లేకుండా చూడాలని, ట్రాఫిక్, విద్యుత్, భద్రతపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలని కోరారు.