ATP: శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి గ్రామంలో నిర్మిస్తున్న కొల్లాపురమ్మ ఆలయ నిర్మాణం కోసం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం రూ.1,00,000 విరాళం అందజేశారు. తన సొంత నిధుల నుంచి ఈ సహాయాన్ని ప్రజావేదిక వద్ద గ్రామస్థులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే సురేంద్ర బాబును శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొల్లాపురమ్మ ఆలయానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం


