హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.20.39 లక్షల CMRF చెక్కుల పంపిణీ

ATP: అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ. 20.39 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం పంపిణీ చేశారు. అనంత రూరల్‌లో 20 మందికి, ఆత్మకూరులో ఐదుగురికి, కనగానపల్లిలో ఏడుగురికి, సీకే పల్లిలో ఐదుగురికి ఈ చెక్కులు అందించారు. ఇప్పటివరకు 1,472 చెక్కుల ద్వారా రూ.11.21 కోట్లు లబ్ధిదారులకు మంజూరయ్యాయని ఆమె తెలిపారు.