హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనేకల్లులో ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌

ATP: కనేకల్లు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న ఆయన, త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.