VZM: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతినే పూజించాలని జేసీ ఎస్. సేధు మాధవన్ పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాల పంపిణీపై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీర్ బి.బి. సరిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి గణపతినే పూజించాలి'


