హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో రైలులో గంజాయి పట్టివేత

సత్యసాయి: పెనుకొండ, హిందూపురం రైల్వే స్టేషన్లలో 'ఈగల్ ఆన్ ట్రైన్'లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్‌తో రైళ్లలో తనిఖీ చేయగా ఓ వ్యక్తి వద్ద ఆరు చిన్న ప్యాకెట్ల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.