హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి

BHNG: మోత్కూర్‌లోని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. స్మశానవాటికలో వసతులు, సీసీ రోడ్డు నిర్మాణం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోతులు, కుక్కల బెడదను నియంత్రించి, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, బుజలాపురంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.