హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దరఖాస్తుల గడువు పొడిగించాలి'

ASR: సామాజిక పెన్షన్ల దరఖాస్తులకు ఇచ్చిన గడువును పొడిగించాలని గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ కోరారు. దరఖాస్తులకు ప్రభుత్వం ఈనెల 16వ తేదీ వరకు గడువు ఇచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆన్‌లైన్ సమస్యలు, విద్యుత్ బిల్లు, ఓటరు గుర్తింపు కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు జత చేయాలనే నిబంధనలతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, గడువు పొడిగించాలని కోరారు.