ASR: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స కోరారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో మార్గదర్శకాలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అవకతవకలపై విచారణ జరపాలి'


