BHPL: కుటుంబ తగాదాల నేపథ్యంలో అంకుషాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి టేకుమట్ల మండల పరిధిలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న వివాదంపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
'PS ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం'


