హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక ఉత్సవాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి'

SRPT: హుజూర్‌నగర్ మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలని ఎస్సై చలికంటి నరేష్ సూచించారు. రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ వినియోగానికి అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదన్నారు. మండపాల వద్ద గొడవలు జరిగితే కమిటీదే బాధ్యత అని సూచించారు.