హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యానాటి కొండలకు న్యాయం చేస్తాం'

SKLM: యానాటి కొండ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం అన్నారు. వారిని ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్‌ను అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు. ఎస్టీ హోదా కేంద్రం పరిధిలోని అంశమని, నిర్ణయం వచ్చే వరకు వారికి ఎస్టీలకు వర్తించే ప్రయోజనాలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని పేర్కొన్నారు.