ELR: ఉంగుటూరు మండలంలోని 23 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించినట్లు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ జాబితాలను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు, ఏవో ఆంజనేయ బాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ


