ELR: బుట్టాయిగూడెం మండలం రామన్నగూడెంకు చెందిన రీత్విక్ జోయేల్ డీఎండీ వ్యాధితో నడవలేని స్థితిలో ఉన్నాడు. చికిత్సకు రూ.26 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని తల్లిదండ్రులు తెలిపారు. “చంద్రబాబు, పవన్, లోకేశ్ గారు.. మా బాబును కాపాడండి" అంటూ తల్లి ప్రశాంతి వేడుకున్నారు. అశ్వారావుపేటలో అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబానికి ప్రభుత్వం, దాతలు అండగా నిలవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాబును కాపాడేందుకు దాతల కోసం ఎదురుచూపు


