MNCL: జిల్లాలో తెల్లకల్లు విక్రయాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కల్తీకల్లు విక్రయాలు సాగుతున్నాయని ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు HYD నుంచి నార్కోటిక్ బృందం తనిఖీలు చేపట్టింది. మంచిర్యాల ACP ప్రకాశ్, CI ప్రమోద్ రావుతో కలిసి దుకాణాలతో పాటు, వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. కల్లు సీసాలను సీజ్ చేసి నమూనాలు సేకరించారు. దాడుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు.
తెలంగాణ
తెల్లకల్లు విక్రయాలపై పోలీసులు ఆకస్మిక దాడులు


