హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ అమరవీరులకు ఘన నివాళి

MGL: జిల్లా అటవీ కార్యాలయంలో శుక్రవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.