హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్‌ రికార్డ్‌ సమీపంలోకి జోరూట్‌

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. సచిన్ ప్రపంచ రికార్డుపై అతడు కన్నేశాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (15,921 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, జో రూట్ 14,216 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ రికార్డును అధిగమించాలంటే రూట్ ఇంకా 1,713 పరుగులు చేయాల్సి ఉంది.