హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ఇద్దరి వల్లే ఫైనల్‌కు చేరాం: కెప్టెన్

మహిళల ఆసియా కప్‌ 2026లో భారత్‌ ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. షెఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌, దీప్తి శర్మ అసాధారణ బౌలింగ్‌ జట్టు విజయానికి కారణమయ్యాయని తెలిపారు. స్పిన్నర్లు మ్యాచ్‌ను శాసించారని ఆమె పేర్కొన్నారు.