హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్టాండ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌

BDK: ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్‌లోని కంట్రోలర్ గదిలో ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. విద్యుత్‌ ఫ్యూజ్ బాక్స్ నుంచి మంటలు వ్యాపించడంతో కంట్రోలర్ రాజేశ్వరరావు, ప్రయాణికులను అప్రమత్తం చేశారు. డిపోలో ఉన్న సిబ్బంది టీఆర్ గ్యాస్‌తో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.